![]() |
![]() |

నీతోనే డాన్స్ 2 . 0 ప్రతీ వారం ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఈ వారం ఎపిసోడ్ ఎపిసోడ్ లో కొన్ని చేంజెస్ కూడా జరిగాయి. అమరదీప్-తేజస్విని వైల్డ్ కార్డు ఎంట్రీతో షోలోకి వచ్చారు. అలాగే మానస్ జోడి సుబ్బుకి చేతికి ఇన్నర్ గా బ్లడ్ క్లాట్ అవడంతో ఒక ఆరు వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారట. దాంతో ఆమె ఈ షో నుంచి డ్రాప్ అయ్యింది. ఆమె ప్లేస్ లోకి మానస్ కి జోడీగా భానుశ్రీ వచ్చింది. ఇక ఈ షోలో బ్రిట్టో-సంధ్య జోడి అంటే అందరూ పడి చచ్చిపోతుంటారు. బ్రిట్టో మాత్రం అందరి కలల రాకుమారుడు. అలాంటి బ్రిట్టో అంటే సుబ్బుకి కూడా చాలా ఇష్టం. ఐతే షోకి కంటిన్యూ అవలేని కారణంతో ఆమె ముద్దుగా ఒక లెటర్ ని బ్రిట్టో కోసం రాసి పంపించింది. దాన్ని హోస్ట్ శ్రీముఖి చదివి వినిపించింది. "ప్రియమైన నీతోనే డాన్స్ టీమ్ కి శుభశ్రీ రాయునది...షోలో నేను ఉన్నది కొన్నాళ్లే ఐనా ఆయన మీద ప్రేమ, గౌరవం పెరిగింది. ఆయన్ని వదిలి దూరంగా వెళ్తున్నందుకు చాల బాధగా ఉంది. ఆయనకు నేను లేని లోటు తెలియకుండా చూసుకోండి.
టైంకి తినేలా చూసుకోండి. ఎండల్లో తిరగకుండా చూసుకోండి. డాన్స్ ఎక్కువగా చేసేసి ఎక్కువగా అలసి పోవద్దని చెప్పండి. డాన్స్ అంతో ఇంతో ఉన్నా ఆ డాన్స్ కి మంచి కామెంట్స్ ఇవ్వండి. ఐ మిస్ యు ఏ లాట్ మై బ్రిట్టో..ప్రేమతో నీ సుబ్బు " అని రాసి పంపించింది. ఐతే లెటర్ లో ఆయన అని సంభోదించేసరికి అందరూ మానస్ గురించి అనుకున్నారు. కానీ చివరికి బ్రిట్టో అని తెలిసేసరికి బ్రిట్టో ఎగిరిగంతేశాడు..ఆ లెటర్ తీసుకుని చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఇక బ్రిట్టో గుణా మూవీలోని ఒక డైలాగ్ "మనుషులు అర్ధం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు" అని చెప్పాడు.
![]() |
![]() |